పరిచయం

ఈ పత్రంలో కింది విషయాలు ఉన్నాయి:

  • విడుదల నివేదిక నవీకరణలు

  • సంస్థాపన-సంబంధిత నివేదిక

  • కెర్నలు నివేదిక

  • డ్రైవర్ నవీకరణ పరిక్రమం

  • కెర్నలు-సంబంధించిన నివేదిక

  • కెర్నలు నివేదిక

  • సాంకేతికత పరిదృశ్యం

  • పరిష్కరించిన విషయాలు

  • తెలిసిన విషయాలు

కొన్ని నవీకరణలుRed Hat Enterprise Linux 5.1 ఈ విడుదల నివేదిక కనిపించక పోవచ్చు. విడుదల నివేదిక యొక్క నవీకరణ ప్రతి ఈ కింది URLలో అందుబాటులో ఉంది:

http://www.redhat.com/docs/manuals/enterprise/

విడుదల నివేదిక నవీకరణలు

ఈ విభాగం Red Hat Enterprise Linux 5.1 గురించిన సమాచారాన్ని కలగిఉంటుంది అది ఈ పంపిణీలో చేర్చబడిన విడుదల నివేదికనందు తయారుచేయనది.

  • Red Hat Enterprise Linux 5 ను పూర్తి సృజనీయ SMP అతిధేయి పై సంస్థాపించుచున్నప్పుడు, సంస్థాపన స్థంభించవచ్చు. ఇది అతిధేయ (dom0) Red Hat Enterprise Linux 5.1 ను నడిపించుటవలన సంభంవంకావచ్చు.

    దీనిని నివారించుటకు, సంస్థాపన ఏక ప్రాసెసర్‌ను ఉపయోగించునట్లు అతిధేయిను అమర్చుము. మీరు దీనిని virt-insatll నందలి ఐచ్చికం --vcpus=1 ఉపయోగించుట ద్వారా చేయవచ్చు. ఒకసారి సంస్థాపన పూర్తైనతర్వాత, virt-manager నందు సమకూర్చిన vcpus ను సవరించుట ద్వారా అతిధేయిను SMP కు అమర్చవచ్చు.

  • ఈ విడుదల WBEMSMT ను చేరుస్తుంది, సాంబా మరియు DNS కు వినియోగదారి-స్నేహపూర్వక నిర్వహణా అంతర్ముఖాన్ని ఇచ్చు వెబ్-ఆధారిత అనువర్తనంల సకలనం. WBEMSMT గురించి అధిక సమాచారం కొరకు, http://sblim.wiki.sourceforge.net/ ను సందర్శించండి.

  • pm-utils యొక్క బీటా వర్షన్ Red Hat Enterprise Linux 5.1 నుండి pm-utils కు నవీకరించుటలో విఫలమౌతుంది, ఈ క్రింది దోషంతో:

    దోషం: ఆర్చివ్‌ను అన్‌ప్యాక్ చేయుటలో దస్త్రం /etc/pm/sleep.d: cpio: rename పై విఫలమైంది
    

    ఇది సంభవించకుండా నిరోధించుటకు, /etc/pm/sleep.d/ సంచయంను నవీకరించుటకు ముందే తొలగించండి. /etc/pm/sleep.d ఏవైనా దస్త్రాలను కలిగిఉంటే, మీరు ఆ దస్త్రాలను /etc/pm/hooks/ కు కదుపవచ్చు.

  • Mellanox MT25204 కొరకు హార్డువేర్ పరిశీలన కొన్ని ఎక్కువ-భారం పరిస్థితులలో అంతర్గత దోషం ఎదురౌతుందని బయల్పరిచింది. ఎప్పుడైతే ib_mthca డ్రైవర్ ఈ హార్డువేరు పైన విపత్తు దోషంను నివేదించినదో, సాదారణంగా అది వినియోగదారుని అనువర్తనంచేత ఉద్భవించిన మిగిలిఉన్న పని అభ్యర్ధనల యొక్క సంఖ్యకు సారూప్యంగా సరిగా ముగింపని క్యూ లోతుకు చెందుతుంది.

    ఆ డ్రైవర్ హార్డువేరును తిరిగిఉంచుతుంది మరియు ఆటువంటి ఘటననుండి పునఃప్రాప్తి చేస్తుంది, ఆ దోష సంభవసమయమందు అన్ని ఏర్పడిఉన్న అనుసంధానములు పోతాయి. ఇది సాదారణంగా వినియోగదారుని అనువర్తనంనందలి విభజన లోపంగా ప్రతిఫలిస్తుంది. ఇంకా opensm దోష సంభవసమయంలో నడుస్తుంటే, అప్పుడు తగినకార్యము ను తిరిగికొనసాగించుటకు దానిని మానవీయంగా పునఃప్రారంభించవలసి ఉంటుంది.

  • డ్రైవర్ నవీకరణ డిస్కులు ఇప్పుడు Red Hat యొక్క డ్రైవర్ నవీకరణ ప్రోగ్రామ్ RPM-ఆధారిత ప్యకేజింగ్ ను మద్దతిస్తాయి. డ్రైవర్ డిస్కు కొత్త రూపంను ఉపయోగిస్తుంటే, సిస్టమ్ నవీకరణలకు నిల్వఉంచు RPM ప్యకేజ్డ్‍ డ్రైవర్స్‍ ను చేర్చుట సాధ్యమౌతుంది.

    సంస్థాపించిన సిస్టమ్‌నందు ఉపయోగంలోఉన్న అప్రమేయ కెర్నల్ వేరియంట్ కొరకు మాత్రమే డ్రైవర్ RPMలు నకలుతీయబడతాయని దయచేసి గమనించండి. ఉదాహరణకు, సృజనీయ కెర్నల్ నడుస్తున్న సిస్టమ్‌పై డ్రైవర్ RPM ను సంస్థాపించుట డ్రైవర్‌ను సృజనీయ కెర్నల్‌ కొరకు మాత్రమే సంస్థాపిస్తుంది. ఆ డ్రైవర్ RPM సిస్టమ్ నందలి ఏ ఇతర సంస్థాపిత కెర్నల్ వేరియంట్ కొరకు సంస్థాపించబడబోదు.

    అందుకని, బహుళ కెర్నల్ వెరియంట్స్‍ సంస్థాపించిన సిస్టమ్స్‍ పై, మీరు ప్రతి కెర్నల్ వేరియంట్ పైన సిస్టమ్‌ను బూట్‌చేసి మరియు డ్రైవర్‌ RPM ను సంస్థాపించాలి. ఉదాహరణకు, మీ సిస్టమ్ నందు బేర్-మెటల్ మరియు సృజనీయ కెర్నల్స్‍ సంస్ధాపించి ఉంటే, మీ సిస్టమ్‌ను బేర్-మెటల్ కెర్నల్ ఉపయోగించి బూట్‌చేసి మరియు డ్రైవర్ RPM ను సంస్థపించు. అప్పుడు, సిస్టమ్‌ను సృజనీయ కెర్నల్‌కు పునఃప్రారంభించి మరియు డ్రైవర్ RPM మరలా సంస్థాపించుము.

  • dom0 యొక్క జీవితకాలమందు, మీరు అతిధేయీలను (i.e xm create) 32,750 కన్నా ఎక్కువసార్లు సృష్టించలేరు. ఉదాహరణకు, మీరు లూప్‌నందు రీబూట్ చేయు అతిధేయిలను కలిగిఉంటే, dom0 మెత్తం 32,750 అతిధేయి బూట్ పర్యాయాల తర్వాత ఏ అతిధేయిను బూట్ చేయలేదు.

    ఈ ఘటన సంభవించితే, dom0 ను పునఃప్రారంభించుము

  • Red Hat Enterprise Linux 5.1 NFS సేవిక ఇప్పుడు సంప్రదీయ ఎగుమతులను మద్దతిస్తుంది. ఈ ఎగుమతులు NFSv4 నియమంకు పొడిగింపులపై ఆధారపడిఉంటాయి. ఈ పొడిగింపులను మద్దతీయని ఏ NFS కక్షిదారైనా (నామంగా, Red Hat Enterprise Linux విడుదలలు 5.1 కు ముందుగా) ఈ ఎగుమతులను వాడుకొనలేడు.

    అందుకని, NFS కక్షిదారు ఈ ఎగుమతులను మద్దతీయకపోతే, ఈ ఎగుమతులను వాడుకొనుటకు ఏ ప్రయత్నమైనా I/O దోషంతో విఫలమౌతుంది. కొన్ని సందర్బాలలో కక్షిదారి రూపకల్పనపై ఆధారపడి, ఆ వైఫల్య చాలా తీవ్రంగా ఉండవచ్చు, సిస్టమ్ క్రాష్ సంభావ్యతకూడా కలిగిఉండవచ్చు.

    NFS సంప్రదీయ పొడిగింపులుకు మద్దీతీయని కక్షిదారులద్వారా వాడబడకుండా తగు ముందుజాగ్రత్తలు తీసుకొనుట చాలా ముఖ్యము.

  • GFS2 GFS యొక్క పెరుగుతున్న అభివృద్ది.ఆన్ డిస్కు ఫైల్ సిస్టమ్ పద్దతి మార్చుటకు అవసరమైన చాలా పురోభివృద్దిని ఈ నవీనీకరణ అందించింది.GFS ఫైల్ సిస్టమ్ ఇప్పుడు GFS2 గా gfs2_convert ఉపయోగించి మార్చవలె,ఏదైతే GFS ఫైల్ సిస్టమ్ మెటాడాటా ను నవీకరిస్తుంది.

    Red Hat Enterprise Linux 5 నందు పరిచయంనుండి బాగా పురోగతిసాధించు వరకు, GFS2 సాంకేతిక పరిదృశ్యంగానే ఉంచబడుతుంది. పంపిణీనందు చేర్చబడిన విడుదల నివేదికలో GFS2 పూర్తిగా మద్దతివ్వబడింది అని తప్పుగా ఉద్ఘాటించబడింది. అయినప్పటికి, బెంచిమార్క్‍ పరీక్షలు క్రిందివాటిపై త్వరిత పనితనాన్ని సూచిస్తున్నాయి:

    • ఒక డైరక్టరీ మరియు వేగవంతమైన డైరెక్టరీ గ్రాహ్యం ఎక్కువ వినిమయం(పోస్టుమార్కు బెంచ్ మార్కు)

    • synchronous I/O విధానాలవల్ల (fstest benchmark పరీక్షTIBCO వంటి సమాచార అనువర్తనాలకి అధిక పనితనాన్ని సూచిస్తోంది)

    • కాచెడ్ చదవబడింది,ఎటువంటి లాకింగ్ భారము లేదు

    • ముందుగాఅమర్చబడిన దస్త్రాలకి సూటి I/O

    • NFS దస్త్రం లుకప్సుని చూచుకోగలదు.

    • df,సమకూర్చబడిన సమాచారంగా ఇప్పుడు ఉంది.

    అదనంగా, GFS2 లో సృజనీయీకణ; కింది లక్షణాలు:

    • పత్రికలు మెటడాటా బదులు ఇప్పుడు సాదా(అంటే దాచిన)దస్త్రాలు.ప్రత్రికలు ఇప్పుడు స్వయంచాలకంగా ఫైల్ సిస్టమ్ ను ఏర్పరిచే ఆధీకృత సర్వర్ కు కలుపబడుతున్నవి.

    • కోట్సు ఇప్పుడు మౌంట్ విధానంquota=<on|off|account> లో సిద్దం మరియు అసిద్దం చేయబడుతున్నవి.

    • quiesce పత్రికల వైఫల్య సమీకరణకు క్లస్టర్సు లో అవసరంలేదు.

    • నేనోసెకండ్ సమయముద్రలు ఇప్పుడు మద్దతునిస్తాయి.

    • ext3 కి సమానంగా, GFS2 ఇప్పుడు data=ordered రీతి కి మద్దతిస్తోంది.

    • ఇప్పుడు నిర్ధారితioctl() ద్వారా సర్దుబాట్లు lsattr() and chattr() మద్దతిస్తున్నాయి.

    • 6TB కన్నా ఎక్కువ ఉన్న ఫైల్ సిస్టమ్సు ఇప్పుడు మద్దతిస్తున్నాయి.

    • GFS2 నిర్ధారిత ఫైల్ సిస్టమ్,మరియు నాన్-క్లస్టర్డు ఆకృతీకరణ లో వాడవచ్చు.

  • Red Hat Enterprise Linux 5.1 ను HP BL860c బ్లేడ్ సిస్టమ్స్‍‌పై సంస్థాపించుట వలన IP సమాచారం అభ్యర్దన స్థాయినందు హాంగ్ కావచ్చు. ఈ విషయంమీరు ఎప్పుడు OK ను Configure TCP/IP తెరనందు రెండుసార్లు ఎంపికచేయాలో విశదపరుస్తుంది.

    ఇది సంభవిస్తే, పునఃప్రారంభించి మరియు సంస్థాపనను ఈథర్‌నెట్ ఆటోనెగేషన్ అచేతనం చేయుట తో జరుపుము. ఇది చేయుటకు, ethtool="autoneg=off" పారామితిని సంస్థాపన మాధ్యమంనుండి బూట్ అవుతున్నప్పుడు ఉపయోగించుము. అలాచేయుట వలన అంతిమ సంస్థాపిత సిస్టమ్ ప్రభావితంకాదు.

  • nohide ఎగుమతి ఐచ్చికం సంప్రదిత ఎగుమతులు (i.e సంప్రదిత సేవికను తెలిపే ఎగుమతులు) పై అవసరం. ఇది ఎందుకంటే సంప్రదిత ఎగుమతులు బందన మౌంటు బిందువును "cross over" చేయవలిసిఉంటుంది.nohide ఎగుమతి ఐచ్చికం "cross over" సఫలమగుటకు అవసరమౌతుంది.

    బందన మౌంట్‌ల పై ఎక్కువ సమాచారం కొరకు, man exports 5 సంప్రదించండి.

  • ఈ నవీకరణం lvm2 ఘటనా మానిటరింగ్ డెమోన్‌ను చేర్చుతుంది. మీరు ఇప్పటికే lvm2 సాదృశ్యాన్ని వా‍డుతుంటే, అన్ని మానిటరింగ్ కార్యక్రమాలు తగురీతిగా నవీకరించబడుటకు ఈ క్రింది అంచెలను జరుపుము:

    1. నవీకరించుటకు మునుపు అన్ని సాదృశ్య lvm2 తార్కిక వాల్యూమ్‌లను క్రియాహీనంచేయుము. ఇది చేయుటకు, ఆదేశం lvchange -a n <volume group or mirrored volume> ఉపయోగించుము.

    2. killall -HUP dmeventd ఉపయోగించి పాత lvm2 ఘటన డెమోన్‌ను నిలిపివేయుము.

    3. అన్ని సంభందిత RPM ప్యాకేజీల యొక్క నవీకరణను జరుపుము, నామేనా device-mapper మరియు lvm2.

    4. అన్ని సాదృశ్య వాల్యూమ్స్‍‌ను lvchange -a y<వాల్యూమ్ సమూహం లేదా సాదృశ్య వాల్యూమ్> ఉపయోగించి తిరిగి క్రియాశీలం చేయుము.

  • రాపిడ్ వర్చ్యులైజేషన్ ఇండెక్సింగ్ (RVI) ఇప్పుడు 64-bit, 32-bit, మరియు 32-bit PAE కెర్నల్స్‍ పైన మద్దతునిస్తోంది. ఏమైనప్పటికి, RVI 32-bit PAE హైపర్‌విజర్ పై 32-bit అతిధేయి సృజనీయ చిరునామాను మాత్రమే అనువాదించగలదు.

    అందువలన, అతిధేయ PAE కెర్నల్‌ను 3840MB కన్నా ఎక్కువ RAM తో నడుపుతుంటే, సరికాని చిరునామా అనువాదం దోషం సంభవిస్తుంది. ఇది అతిధేయిను క్రాష్‌చేయగలదు.

    మీరు RVI క్రింద 4GB భౌతిక RAM కన్నా ఎక్కువ అతిధేయీలను నడపాలనుకుంటే మీరు 64-bit కెర్నల్ ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది.

  • AMD Rev F ప్రోసెసర్స్‍ ఉపయోగించి 16 కొర్స్‍ లేదా ఎక్కువ న‍డుపుట వలన పూర్తి-సృజనీయ అతిధేయి సంస్థాపన జరుపుతున్నప్పుడు సిస్టమ్ తిరిగిఉంచబడుటకు కారణంకావచ్చు.

  • systemtap-runtime ప్యాకేజ్ సంస్థాపన systemtap ప్యాకేజి ఇప్పటికే సంస్థాపించిఉంటే బదిలీకరణ పరిశీలన దోషంకు ప్రతిఫలిస్తుంది. ఇంకా, systemtap ప్యాకేజి ఇప్పటికే సంస్థాపించబడిఉంటే Red Hat Enterprise Linux 5 నుండి 5.1 కు నవీకరించుట కూడా విఫలమౌతుంది.

    అందుకని, systemtap-runtime ను సంస్థాపించుటకు మునుపులేదా నవీకరణను జరుపుటకు ముందు rpm -e systemtap-0.5.12-1.e15 ఆదేశాన్ని ఉపయోగించి systemtap ప్యాకేజిని తీసివేయుము.

  • NFSROOT అమర్చుతున్నప్పుడు, /etc/sysconfig/network-scripts/ifcfg-eth0 నందు BOOTPROTO తప్పక BOOTPROTO=dhcp లాగా అమర్చబడాలి.

    మీ వాతావరణంకు BOOTPROTO కొరకు విభిన్నమైన అమరిక అవసరమైతే, అప్పుడు /etc/sysconfig/network-scripts/ifcfg-eth0 నందు BOOTPROTO=dhcp తాత్కాలికంగా అమర్చుము ప్రాధమికంగా initrd సృష్టించక మునుపు. initrd సృష్టించిన తర్వాత మీరు BOOTPROTO విలువను తిరిగిఉంచవచ్చు.

  • IBM Bladecenter కు QLogic iSCSI Expansion Card ఈథర్‌నెట్ మరియు iSCSI రెండు కార్యక్రమాలను ఇస్తుంది. కొన్ని విభాగాలు కార్డుపై రెండు కార్యక్రమాలచేత పంచుకొనబడతాయి. ఎమైనప్పటికి, ప్రస్తుత qla3xxx మరియు qla4xxx డ్రైవైర్స్‍ ఈథర్‌నెట్ మరియు iSCSI కార్యక్రమాలను స్వతంత్రంగా మద్దతునిస్తాయి. రెండు డ్రైవర్స్‍ ఈథర్‌నెట్ మరియు iSCSI కార్యక్రమాలను ఏకకాలమందు ఉపయోగించుటకు మద్దతీయవు.

    అందుకని, ఈథర్‌నెట్ మరియు iSCSI కార్యక్రమాలను ఏకకాలంనందు ఉపయోగించుట పరికరాన్ని హాంగ్‌చేస్తుంది. iSCSI పరికరాల పై ఇది డాటా నష్టము మరియు దస్త్ర వ్యవస్థ నష్టము కు కారణంఅవుతుంది, లేదా ఇతర అనుసంధానిత ఈథర్‌నెట్ పరికరాలకు నెట్వర్క్‍ భంగాలకు కారణమౌతుంది.

  • virt-manager ను డిస్క్‍‌లను ఉన్న అతిధేయికు జతచేయుటకు ఉపయోగించినప్పుడు, నకిలీ ప్రవేశాలు అతిధేయి యొక్క /etc/xen/<domain name> ఆకృతీకరణ దస్త్రంనందు సృష్టించబడవచ్చు. ఈ నకిలీ విలువలు అతిధేయను బూటింగ్ కాకుండా నిరోధిస్తాయి.

    అందుకని, మీరు ఈ నకిలీ విలువలను తీసివేయవలెను.

  • ఒక అతిధేయి పలుపర్యాయాలు రెండు అతిధేయల మద్య మైగ్రేటింగ్ అవుట అతిధేయ కష్టంకు కారణం అవుతుంది. ఒక అతిధేయ రీబూటింగ్ అతిధేయి సిస్టమ్‌నుండి బయటకు మైగ్రేట్ అయినతర్వాత మరియు అదే అతిధేయి వెనుకకు వచ్చు ముందు జరిగితే, నష్టం ఎదురవదు.

  • sysreport అనునది sos దృష్ట్యా నిరోదించబడింది. sos ను సంస్థాపించుటకు, yum install sos ను నడుపుము. ఈ ఆదేశం sosను సంస్థాపిస్తుంది మరియు తీసివేస్తుంది. దీనిని ప్రతిబింబించుటకు మీరు ఉన్న అన్నీ కిక్‌స్టార్ట్‍ దస్త్రాలను ను నవీకరించుట సిఫార్స్‍ చేయబడింది.

    sos సంస్థాపించిన తర్వాత, ఇన్వోక్‌చేయుటకు sosreport ఆదేశం ఉపయోగించు. sysreport ఇప్పుడు నిరోధించబడింది అను హెచ్చరికను సంభవింపచేయుటకు sysreport ఆదేశంను ఉపయోగించుము; కొనసాగింపు sosreport ఇన్వోక్ చేస్తుంది.

    మీరు ప్రత్యేకంగా sysreport సాధనంను ఉపయోగించవలిసివస్తే, ఇన్వోక్‌చేయుటకు sysreport.legacy ఆదేశంను ఉపయోగించుము.

    sosreportగురించి అధిక సమాచారం గురించి, man sosreport మరియుsosreport --help సంప్రదించండి.

సంస్థాపన-సంబంధ నివేదిక

ఈ కింది విభాగం ప్రత్యేకించిAnacondaసంస్థాపనకు సంబంధించిన సమాచారాన్ని; మరియూ వేరొక సంస్థాపన Red Hat Enterprise Linux 5.1. కలిగి ఉంది.

ఇప్పటికే సంస్థాపించిన Red Hat Enterprise Linux 5 ను నవీకరించుటకు, మీరు Red Hat Network మార్చబడిన ప్యాకేజీలను నవీకరించుటకు ఉపయోగించవచ్చు.

మీరు Anaconda ను Red Hat Enterprise Linux 5.1 యొక్క రీఫ్రెష్ సంస్థాపన జరుపుటకు లేదా Red Hat Enterprise Linux 4 నుండి Red Hat Enterprise Linux 5.1వరకు సరికొత్త నవీకరించిన వర్షన్ నుండి నవీకరణ జరుపుటకు ఉపయోగించవచ్చు.Anaconda ఇప్పటికే సంస్థాపించిన Red Hat Enterprise Linux 5 ను నవీకరించుటకు కూడా ఉపయోగపడగలదు.

  • ఒక వేళ మీరు Red Hat Enterprise Linux 5 CD-ROMల (నెట్వర్కు-ఆధారిత సంస్థాపనలో, ఉదాహరణకు) విషయాలను కాపీచేస్తుంటే CD-ROMలను ఆపరేటింగు విధానం కోసం మాత్రమే కాపీ చేయండి. ప్రత్యామ్నాయ CD-ROMని కాని,ఏ ఇతర లేయర్డ ఆధారిత సిడి-రామ్సు ను గాని కాపి చేయకండి,అది Anaconda సరియైన ఉపయోగాన్ని నిరోదిస్తుంది.

    Red Hat Enterprise Linux 5.1 సంస్థాపన జరిగిన తరువాత మాత్రమే ప్రత్యామ్నాయ CD-ROM మరియు వేరే లేయర్డు ఆధారిత CD-ROMs ను సంస్థాపంచవలెను.

  • Red Hat Enterprise Linux 5.1 వీటిని పూర్తిగా సృజనీయీకరించిన అతిధేయ పై సంస్థాపించునపుడు kernel-xenకెర్నల్ ను వాడవద్దు.ఈ కెర్నల్ ను పూర్తిగా వాస్థవీకరించిన అతిధేయ లో ఉపయోగించడం వలన సిస్టమ్ హేంగ్ కావచ్చు.

    పూర్తిగా సృజనీయీకరిం అథిదేయలో Red Hat Enterprise Linux 5 .1సంస్థాపనా సంఖ్యతో సంస్థాపించేటట్లైతే virtualization ప్యాకేజీ సమూహం ఎన్నిక చేయకండి.Virtualization ప్యాకేజీ సమూహం kernel-xen కెర్నల్ ను సంస్థాపించును.

    పరాన్నవాస్థవీకరణ అథిదేయులు ఈ విషయం ద్వారా ప్రభావితం కాదు. పరాన్నవాస్థవీకరణ అథిదేయులు ఎల్లప్పుడు kernel-xen కెర్నల్ ను వాడతారు.

  • మీరు Red Hat Enterprise Linux 5 నుండి 5.1 కు నవీకరిస్తున్నప్పుడు సృజనీయ కెర్నల్‌ను ఉపయోగిస్తుంటే, నవీకరణ పూర్తైన తర్వాత మీరు తప్పక తిరిగిబూట్ చేయాలి. అప్పుడు మీరు నవీకరించిన సృజనీయ కెర్నల్ ఉపయోగించి సిస్టమ్‌ను బూట్ చేయాలి.

    Red Hat Enterprise Linux 5 మరియు 5.1 యొక్క హైపర్‌విజర్స్‍ ABI-సారూప్యమైనవి కావు. నవీకరించిన సృజనీయ కెర్నల్‌ను ఉపయోగించి నవీకరించిన తర్వాత మీరు సిస్టమ్‌ను బూట్ చేయకపోతే, నవీకరించబడిన సృజనీయ RPMలు నడుస్తున్న కెర్నల్‌కు సరిపోలలేవు.

iSCSI సాఫ్టువేరు ప్రారంభం కోసం (బహిర్గత-iscsi) సంస్థాపన / బూట్

iSCSI సంస్థాపన మరియు బూట్ Red Hat Enterprise Linux 5 నందు సాంకేతిక పారిదృశ్యంగా పరిచయం చేయబడినది. క్రింద విశదీకరించిన పరిమితులకు లోబడి ఈ లక్షణం పూర్తిగా దోహదపడుతుంది

దీని యొక్క మూడు సామర్ధ్యపు ఆకృతీకరణలు వీటిమీద ఆధారపడి ఉంటుంది:

  • హార్డువేర్ iSCSI ప్రారంబిక(అదిQLogic qla4xxx) ను ఉపయోగిస్తుంది.

  • open-iscsi ప్రారంబికని iSCSI(అది iSCSI బూట్ ఫర్మువేర్ లేదా iSCSI బూట్ సామర్ధ్యంను స్వభావించు ఓపెన్ ఫర్మువేర్ విడుదల) ఫర్మువేర్ బూట్ మద్దతు కొరకు సిస్టమ్ లొ ఉపయోగించండి.

  • open-iscsi ప్రారంబికని iSCSI కొరకు ఫర్మువేర్ బూట్ మద్దతు లేకుండా ఉపయోగించండి.

హార్డువేర్ iSCSI ప్రారంబికని ఉపయోగించు.

మీరు iSCSI హార్డువేర్ ప్రారంబికని ఉపయోగించినట్లైతే , రిమోట్ నిల్వ అందుబాటును పొందటానికి అవసరమైన IP చిరునామా మరియు ఇత్రత్రా పారామీటర్సు కార్డు యొక్క BIOS సంస్థాపన ద్వారా ప్రవేశపెట్టుట వలన పొందవచ్చు.అదనపు సంస్థాపన అవసరం లేకుండానే రిమోట్ నిల్వ యొక్క ఉపభాగాలు Anaconda వద్ద ప్రమాణ sd సాధనాలుగా అందుబాటలో ఉంటాయి.

మీకు రిమోట్ నిల్వ సర్వర్ ఆక్రుతీకరణను అనుసరించి ప్రారంభిక అర్హత పేరు(IQN) నిర్ధారించుకోవలిసి వస్తే, సంస్థాపనలో ఈ వరుస క్రమమును అనుసరించండి.

  1. సంస్థాపనలో ఏ డిస్కు డ్రైవర్సు ఉపయోగించాలో ఎంచుకొనుటకు సంస్థాపనా ప్రతికి వెళ్ళండి.

  2. ఆధునిక నిల్వ ఆకృతీకరణకు ని నొక్కండి.

  3. Add iSCSI target.ని నొక్కండి.

  4. iSCSI IQN తెరపై ప్రదర్శితమవుతుంది.

iSCSI కొరకు ఫర్మువేర్ బూట్ మద్దతుతో సిస్టమ్ లోopen-iscsi ఉపయోగించు.

open-iscsi సాఫ్టు వేర్ ప్రారంబికని iSCSI కొరకు సిస్టమ్ లో ఫర్మువేర్ బూట్ మద్దతుతో ఉపయోగించేటట్లైతే, రిమోట్ నిల్వ పొందటానికి అవసరమైన IP చిరునామా మరియు ఇత్రత్రా పారామీటర్సు ప్రవేశానికి ఫర్మువేర్ యొక్క సెటప్ యుటిలిటిని ఉపయోగించు.ఇది చేయటానికి సిస్టమ్ ను రిమోట్ iSCSI నిల్వ బూట్ ఆకృతికి మార్చండి.

ప్రస్తుతం అనకొండ ఫర్మువేర్ ఇచ్చిన iSCSI సమాచారంను ఉపయోగించుటలేదు.బదులుగా సంస్థాపనయందు మానవీయంగా టార్గెట్ IP చిరునామాను ప్రవేశపెట్టుము.అది చేయుటకు పైన చెప్పినట్లు ప్రారంబిక యొక్క IQN ని నిర్ధారించుము.తరువాత మీరు సంస్థాపించదలచిన టార్గెట్ IP చిరునామాను అదే ప్రతిలో ప్రదర్శించబడిన IQN ప్రారంబిక వద్ద తెలుపండి.

మానవీయంగా iSCSI టార్గెట్ యొక్క IP చిరునామాను తెలిపిన తరువాత,iSCSI టార్గెట్ నందుగల తార్కిక భాగాలు సంస్థాపనకు అందుబాటులో ఉంటాయి.Anacondaద్వారా సృష్టించబడినinitrd ఇప్పుడు iSCSI టార్గెట్ యొక్క IQN మరియు IP చిరునామాను కలిగి ఉంటుంది.

iSCSI టార్గెట్ యొక్క IQN లేదా IP చిరునామాలను భవిష్యత్తులో మార్చేటట్లైతే,iBFT లేదా ప్రతి ప్రారంబిక యొక్క ఫర్మువేర్ సెటప్ యుటిలిటి తెరచి సంభందించిన పారామీటర్సు మార్చి ప్రవేశపెట్టుము.తరువాత ప్రతి ప్రారంబికననుసరించి initrd (iSCSI నిల్వలో ఉన్న) మార్చుము.

  1. initrd ను gunzip.ఉపయోగించి విశదీకరించు.

  2. cpio-i ఆదేశాన్ని ఉపయోగించండి.

  3. init లో iscsistartup అను పదము గల వాక్యం కొరకు వెదుకు.ఈ వాక్యం iSCSI యొక్క IQN మరియు IP చిరునామా ను కలిగి ఉంటుంది.క్రొత్త IQN మరియు IP చిరునామా లతో దానిని నవీకరించు.

  4. cpio -oఆదేశాన్ని ఉపయోగించి initrd ఎన్క్రిప్టు విలువని సృష్టించు.

  5. initrd ని gunzip ఉపయోగించి మరల కుదించుము.

బాహ్య Firmware ఇచ్చే iSCSI సమాచారం ఆపరేటింగ్ విధానం పొందటానికి /iBFT firmware భవిష్య విడుదలలో ప్రణాలిక చేయుచున్నది. ఈ వృద్తి iSCSI టార్గట్ యొక్క IP చిరునామా లేదా IQN initrd(iSCSI నిల్వలో ఉన్న) ప్రతి ప్రారంబికకు మార్చే అవసరాన్ని తోలగిస్తుంది.

open-iscsi ని సిస్టమ్ లో iSCSI కొరకు ఫర్మువేర్ బూట్ మద్దతు లేకుండా ఉపయోగించండి.

మీరు open-iscsi సాఫ్టువేర్ ప్రారంబికని సిస్టమ్ లో iSCSI ఫర్మవేర్ బూట్ మద్దతు లేకుండా ఉపయోగించేటట్లైతే,నెట్వర్కు బూట్ సామర్ధ్యం(అవి PXE/tftp) ఉపయోగించండి.ఈ సందర్భంలో ప్రారంబిక IQN మరియు iSCSI టార్గెట్ IP చిరునామా నిర్ణయించుటకు ముందుగా విసదీకరించిన విధానాన్ని అమలుచేయండి. అయిన తరువాతinitrd ను నెట్వర్కు బూట్ సర్వర్ లో ఉంచి,సిస్టమ్ ను నెట్వర్కు బూట్ లో ఉంచండి.

అదేవిధంగా,iSCSI టార్గట్ యొక్క్క IQN లేదా IP చిరునా మారితే,initrd తప్పక మార్చవలెను. అది చేయుటకు initrd ప్రతి ప్రారంబికకు మార్చుటకు ముందుగా విసదీకరించిన విదానాన్ని ఉపయోగించండి.

భవిష్య-నవీకరణలు

EXT3 కోసం వృద్ధి

EXT3 యొక్క గరిష్ఠ పరిమితి ఇప్పుడు 16TB(8TB నుండి పెరిగింది).ఈ వృద్ది ప్రాధమికంగా సాంకేతిక పారిదృశ్యంగా Red Hat Enterprise Linux 5 దీనిలో చేర్చబడినది,ఈ విడుదలలో పూర్తిగా మద్దతు నిస్తోంది.

yum-security

ఇప్పుడు yum ను రక్షణ పురోగమ సంస్థాపనకుమాత్రమే నియంత్రించ వచ్చును.అది చేయుటకుyum-security ని సంస్థాపించి,ఈ క్రింది ఆదేశాన్ని నడుపుము.

yum update --security

వనరుని స్వతంత్రంగా పునఃప్రారంభించుట.

క్లస్టర్ యొక్క ప్రాధమిక సేవకు భంగం కలిగించకుండానే వనరును పునఃప్రారంభించ వచ్చు.వనరులని స్వతంత్రంగా వుంచటావికి __independent_subtree="1" ని ఉపయోగించి,నడుస్తున్న ఉపయుక్త లో /etc/cluster/cluster.conf ని ఆకృతీకరించవలెను.

ఉదాహరణకుసం:

<service name="example">
        <fs name="One" __independent_subtree="1" ...>
                <nfsexport ...>
                        <nfsclient .../>
                </nfsexport>
        </fs>
        <fs name="Two" ...>
                <nfsexport ...>
                        <nfsclient .../>
                </nfsexport>
                <script name="Database" .../>
        </fs>
        <ip/>
</service>

ఇక్కడ రెండు దస్త్ర పద్దతి వనరులు ఉన్నాయి.One and Two. Oneవిఫలమైతే Twoకి భంగం వాటిల్లకుండా పునఃప్రారంబించ బడుతుంది.Twoవిఫలమైతే అన్ని మూలకాలు(One,One యొక్క చిల్డ్రన్ మరియు Two యొక్క చిల్డ్రన్)పునఃప్రారంబించ బడతాయి.One తో సమకూరే ఏ వనరుపైనైనా ఆధారపడి ఉన్న Two మరియు చిల్డ్రన్ కూడా.

Samba స్వతంత్ర ఉపశాఖలతో కూడిన సేవలో ఉపయోగపడదు గనుక దానికి నిర్దిష్ఠమైన సేవారూపం అవసరం.ఇది చాలా సేవలలో సృజనీయం.అందుకని __independent_subtree="1" ని గమనిక తో వాడండి.

సృజనీయ

కింది గుణకాలు కూడా దీనిలొ చేర్చబడ్డాయిలేదు:

  • ఈ సృజనీయీకరించబడిన కెర్నలు kdump క్రియాశీలతను ఉపయోగించగలదు.

  • AMD-V ఈ విడుదలలో మద్దతునిస్తుంది.ఇది పూర్తిగా సృజనీయీకరించబడిన అతిధేయాలకు లైవ్ డోమైన్ మైగ్రేషన్ ను ఇస్తుంది.

  • సృజనీయిక కెర్నల్ ఇప్పుడు 16GB RAM దాకా మద్దతునిస్తుంది.

  • in-kernel socket API ఇప్పుడు విస్తరించబడినది.అతిధేయాల మద్య sctp నడుపుతున్నప్పుడు వచ్చే బగ్ గుర్తించడానికి ఇది చేయబడినది.

  • సృజనీయిక నెట్వర్కింగ్ ఇప్పడు సృజనీయిక లైబ్రరి లోని libvirt యెక్క భాగం.libvirt మిషన్ లోని స్థానిక అతిధేయాల కొరకు సృజనీయ NAT/router మరియు వ్యక్తిగత వలయం సమకూర్చుటకు ఆదేశాల సమూహాన్ని కలిగి ఉంది.ఇది ప్రత్యేకంగా బయటనుండి రాని అతిధేయాలకు ఉపయోగం.సృజనీయికతను ల్యాప్ టాప్ నందు ఉపయోగించే వారికి కూడా ఉపయోగం.

    సృజనీయిక నెట్వర్కింగ్ సామర్ధ్యం,dnsmasq ఏదైతే dhcpని సృజనీయిక నెట్వర్కు కొరకు కలిగి ఉందో ,దాని పై ఆధారపడునట్లు చేస్తుంది.ని

    libvirtప్రతి నవీకరణాకు, దయచేసి http://people.redhat.com/dledford/Infiniband/openmpiను శోధించండి

  • libvirt ఇప్పుడు అచేతన వాస్తనిక మిషన్సుని నిర్వహించగలదు. libvirt దీనిని డొమైన్లను ప్రారంబించడం లేదా ఆపివేయడం చేయకుండానే నిర్వచన మరియు అనిర్వచన ద్వారా చేయగలదు. ఈ క్రియాశీలత virsh define మరియు virsh undefine ఆదేశాలకు ఐచ్చికం.

    ఈ వృద్ది ద్వారా Red Hat సృజనీయిక మిషన్ నిర్వహణను అందుబాటులో ఉన్న అన్ని అతిధేయాలను ప్రదర్శింప గలుగుతుంది. ఇది మిమ్ముల్ని సూటిగా GUI ఈ అతిధేయాలను ప్రారంభింపనిస్తుంది.

  • ఉదాహరణకు, kernel-xen ప్యాకేజీ సంస్థాపన తరువాత, elilo.conf కింది విధంగా చదవబడుతుంది:

  • పూర్తిగా సృజనీకరించిన అతిధేయీలు ఇప్పుడు ప్రత్యక్ష మైగ్రేషన్‌ను మద్దతిస్తాయి.

  • xm create ఆదేశం సృజనీయిక కంప్యూటరు మేనేజరులోని చిత్రసంబంధ virt-managerలను కలిగిఉంది.

  • Nested Paging (NP) ఇప్పుడు మద్దతునిస్తుంది.ఈ లక్షణం సృజనీయిక పరిసరాలలో మెమొరీ నిర్వహణా కష్టాన్ని తగ్గిస్తుంది.అదనంగా NP, CPU ఉపయోగాన్ని మెమొరీ-ఇటెన్సివ్ అతిధేయాల లో తగ్గిస్తుంది.

    ప్రస్తుతం NP ప్రాధమికంగా ఉపయోగంలోకి రాదు.మీ సిస్టమ్ NP కి మద్దతునిచ్చున దైతేhap=1 పారామీటర్ తో హైపర్వజర్ బూటింగుతో NP సిద్దం చేయుట మంచిది.

భాగస్వామ్య ప్రతి పట్టీలు.

భాగస్వామ్య ప్రతి పట్టీలుఇప్పుడుhugetlb మెమొరీ కి మద్దతు నిస్తున్నది. ఇది ప్రతి పట్టీల వివరాలను వేర్వేరు విధానాల మధ్య పంచుకోవటానికి సాద్యపడుతుంది.

ప్రతి పట్టీ వివరాలను వేర్వేరు విధానాల మద్య పంచుకోవడం వలన క్యాషీ స్థలం తక్కువ ఖర్చవుతుంది.ఇది అనువర్తనాలు క్యాషీని తాకు నిష్పత్తి పెరిగి,అనువర్తనం యొక్క కార్యదక్షత పెరుగుతుంది.

డ్రైవర్

divider=<value> వినియోగదారి స్పేస్ అనువర్తనంలకు ఒకే దర్శనీయ HZ సమయ విలువను నిర్వహిస్తున్నప్పుడు మిమ్ముల్ని సిస్టమ్ గడియారం దరను సర్దుబాటు చేయుటకు మిమ్ముల్ని అనుమతించే కెర్నల్ ఆదేశ-వరుస పారామితి ఐచ్చికం.

divider= ఐచ్చికంను ఉపయోగించుట CPU భారాన్ని తగ్గించుటకు మరియు నేర్పరితనాన్ని ప్రొఫాలింగ్ మరియు సమయరీతి కార్యాల యొక్క పర్యాయాలను తగ్గించుట ద్వారా పొందుటకు అనుమతిస్తుంది. ఇది సృజనీయ వాతావరణములకు అదేవిధంగా ప్రత్యేక అనువర్తనంలకు ఉపయోగకరంగా ఉంటుంది.

<values>

  • 2 = 500Hz

  • 4 = 250Hz

  • 10 = 100Hz (Red Hat Enterprise Linuxయొక్క గతవిడుదల విలువనుపయోగించి)

Note that the virtualized kernel uses a 250HZ clock by defaul. As such, it does not need the divider= option either in dom0 or in paravirtualized guests.

dm-బహుళ మార్గం సాధనాలకు సంస్థాపిస్తోంది

Anacondaండ ఇప్పుడు నియంత్రణ, సృష్టించటం, మరియూdm-multipath సాధనాలకు సంస్థాపించటం మొదలైన సామర్ధ్యాలను కలిగి ఉంది. ఈ లక్షణాలను సాధ్యం చేయటానికి, mpath పారామితిని కెర్నల్ బూట్ పంక్తికి కలపండి.

ఈ లక్షణం ప్రధమంగా Red Hat Enterprise Linux 5 లో సాంకేతిక పరిదృశ్యంగా పరిచయంచేయబడింది, మరియు ఇప్పుడు పూర్తిగా మద్దతునిస్తోంది.

dm-multipath,Dell MD3000కొరకు ఇన్ బాక్సు సపోర్టు నిస్తోంది. ఏమైనప్పటికి MD3000 పొందటానికి dm-multipath ని ఉపయోగించే బహుళ నోడ్లు తత్వర ఫెయిల్ బాక్ చేయలేక పోతున్నాయి.

ఇంకా మీ సిస్టమ్ బహుళమార్గం మరియు బహుళమార్గంకాని పరికరాలను కలిగి ఉంటే ఇచ్చా విభజన అంతర్ముఖనం Anaconda లో మంచిది.స్వయంచాలక విభజన చేసినట్లైతే ఆసందర్భంలో ఐచ్చిక తార్కిక పరిమాణ సమూహం లోనే ద్వంద విధాన పరికరాలను ఏర్పరుస్తుంది.

ప్రస్తుతం ఈ నియమాలు ఈ లక్షణం కు వర్తిస్తాయి.

  • ఒకే ఒక బూట్ తార్కిక విభాగ సంఖ్య(LUN) ఉన్నా,AnacondaSCSI పరికరాన్ని mpath తెలిపిన కూడా సంస్థాపిస్తుంది.తరువాత కూడా మీరు బూట్ LUN కి బహుళ మార్గాలను మరియు initrd మరల సృష్ఠించిన,ఆపరేటింగ్ సిస్టమ్ dm-multipath పరికరం నుండి కాకుండా SCSI పరికరం నుండి బూట్ అవుతుంది.

    LUN బూట్ కావటానికి బహుళమార్గాలు ఉన్నప్పటికి,కెర్నల్ బూట్ వరుసలోmpath తెలిపిన తరువాత dm-multipath పరికరానికి Anaconda ఖచ్చితంగా సంస్థాపించబడుతుంది.

  • వినిమయకారుని_సహాయక_నామాలు సరే గా multipath.conf లో సరిచేయబడతాయి. dm-multipath మూల పరికరం యొక్క మద్దతు పెంచటానికి ఇది అవసర సర్దుబాటు.వినిమయకారుని_సహాయక_నామాలు వద్దుకు మరియుinitrd ని తిరిగి సృష్ఠిస్తే, క్రింది కారణాలతో బూట్ వైఫల్యం సంభవిస్తుంది:

    ఫైల్ సిస్టమ్ ను పరీక్షిస్తుంది
    fsck.ext3: తెరుచుటకు ప్రయత్నించునపుడు అటువంటి దస్త్రము లేదా డైరెక్టరీ లేదు/dev/mapper/mpath0p1
    
నిల్వ ప్రదేశ వలయం(SAN) నుండి బూటింగ్.

SAN డిస్కు పరికరం నుండి బూట్ మద్దతు నిస్తుంది.ఈ సందర్భంలో SAN ఫైబర్ చానల్ లేక iSCSI అంతర్ముఖిని చూస్తుంది. ఈ సామర్ద్యం dm-multipath ని వాడి బహుళ మార్గల ద్వారా సిస్టమ్-నుండి-నిల్వ అనుసంధానిస్తుంది.

ఆకృతీకరణలలో బహుళ అతిధేయి బస్ ఎడాప్టర్సు(HBA) ని ఉపయోగిస్తుంది,ప్రస్తుత ఎడాప్టర్ నుండి వచ్చు అన్ని మార్గాలు విఫలమైతే సిస్టమ్ BIOS ను వేరే మార్గంనుండి బూట్ అగునట్లు సర్దు చేయవలె.

డ్రైవరు నవీకరణ పరిక్రమం

డ్రైవర్ నవీనీకరణ పరిక్రమం(DUP) మూడో-పార్టీ వెండార్సు వారి స్వంత డ్రైవర్ పరికరాలు మరియు వేరే లైనెక్సు కెర్నల్ గుణకాలు Red Hat Enterprise Linux 5 కు కలుపుటకు నిర్మించబడింది.నిత్య RPM ప్యాకేజీలను సరఫరాచేయుటకు సిస్టమ్సు ఉపయోగించుకుంటాయి.

గమనించు విధంగా Red Hat Enterprise Linux 5.1చాలా నవీనీకరణలను DUP కి అమలు చేసింది.

  • డ్రైవర్ నవీనీకరణ డిస్కు ద్వారా సమయ-డ్రైవర్ నవీనీకరణ RPMs సంస్థాపన ఇప్పుడు మద్దతిస్తోంది.

  • బూట్ మార్గ నవీనీకరణలు సిస్టమ్ బూట్ మార్గం పై ప్రభావితం చూపుట ఇప్పుడు మద్దతునీయబడింది.

  • మూడో-పార్టీ ప్యాకేజీAdvanced Linux Sound Architecture(ALSA) కి మద్దతు డిప్రికేట్ చేయబడింది.

ఇంకా అనుమతించబడిన కెర్నల్ ABI గుర్తు తెలుపు జాబితాలకు వేర్వేరు నవీనీకరణలు అమలుచేయబడతాయి.మూడో-పార్టి డ్రైవర్ కెర్నల్ యొక్క ఏ గుర్తులను మరియు డాటా ఆకృతులను వాడాలో నిర్ధారించుటకు ప్యాకేజింగ్ డ్రైవర్సు ఈ తెలుపుజాబితాలను ఉపయోగించుకుంటాయి.

అధిక సమాచారం కొరకు http://www.kerneldrivers.org/RedHatKernelModulePackages. చూడండి.

డ్రైవరు నవీకరణాలు

సాధారణ డ్రైవర్ నవీనీకరణలు.
  • లెనోవో లాప్ టాప్ లలో చాలా ACPI మరయూ డాకింగ్ క్షేత్ర విషయాలను గుర్తించటానికి,acpi ibm-acpi గుణకాన్ని నవీకరించింది.

  • బేస్ బోర్డ నిర్వహణా నియంత్రికకు హార్డువేర్ బంధకం ఏర్పడితే ipmi: Polling kthread ఇక నడవదు.

  • sata: SATA/SAS 2.6.22-rc3 కి నవీకరించబడింది.

  • openib మరియు openmpi:OFED (OpenFabrics Enterprise Distribution) విడుదల 1.2. కి నవీకరించ బడ్డాయి.

  • powernow-k8: Greyhoundకి పూర్తిగా మద్దతు నివ్వడానికి విడుదల 2.0.0 కు నవీకరించబడింది.

  • పూర్తిగా RSA సపోర్టు కొరకు xinput కలుపబడింది.

  • ఎంబడెడ్ సీక్వెన్సర్ ఫర్మువేర్ ను v17 కి నవీకరించడంతోపాటు,aic94xx: విడుదల 1.0.2-1 కి నవీకరించబడింది.ఈ నవీనీకరణలు క్రింది మార్పులను అమలు పరుస్తాయి.

    • విస్తరణలతో ఫ్లాట్ఫాం పై ascb రేస్ కండీషన్.

    • added REQ_TASK_ABORT and DEVICE_RESET handlers

    • తప్పును గుర్తించిన తరువాత భౌతిక పోర్ట్సు సవిధంగా శుభ్రపరచబడతాయి.

    • phys ఇప్పుడు sysfs ద్వారా సిద్దం మరియు అసిద్దం చేయబడుతుంది.

    • DDB రేస్ కండీషన్ నియంత్రించుటకు DDB లాక్ ఉపయోగం పొడిగించబడింది.

ద్వని

ALSA నిడుదల 1.0.14 కి నవీకరించ బడింది.ఈ నవీకరణ క్రింది సవరణలను అమలుపరుస్తుంది.

  • IBM Taroko (M50) లో ధ్వని ఇబ్బందులను సరిచేస్తుంది.

  • Realtek ALC861 ఇప్పుడు మద్దతునిస్తుంది.

  • xw8600 and xw6600 లో మ్యూటింగ్ ఇబ్బంది సరిచేయబడింది.

  • ADI 1884 Audio ఇప్పుడు మద్దతునిస్తోంది.

  • xw4600 శబ్ద ఆకృతీకరణ ఇబ్బంది సరిచేయబడింది.

PCI
  • కలుపబడిన క్రియాశీలత గరిష్ట చదువు అభ్యర్ధనను PCIX and PCI-Express కొరకు ఉంచుతుంది.

  • IBM System P ఇప్పుడు PCI-Express హాట్ ప్లగింగ్ కు మద్దతునిస్తోంది.

  • SB600 SMBus కు మద్దతునివ్వటానికి అవసరమైన డ్రైవర్సు మరియు PCI ID కలుపబడినవి.

నెట్వర్కింగ్
  • I/OAT-సిద్దంచేయబడిన చిప్సెట్ మద్దతు ఇవ్వడానికి e1000 డ్రైవర్ విడుదల 7.3.20-k2 కు నవీకరించబడింది.

  • 5709 హార్డవేర్ కు మద్దతునివ్వడానికి bnx2 డ్రైవర్ విడుదల 1.5.11 కు నవీకరించబడింది.

  • క్రింది మార్పుల కొరకు B44 ఈదర్ నెట్ డ్రైవర్:అప్ స్టీమ్ విడుదల 2.6.22-rc4 కు బ్యాక్ పోర్టు చేయబడింది.

    • చాలా endianness సరికూర్పులు చేయబడ్డాయి.

    • DMA_30BIT_MASK స్థిరరాశి ఇప్పుడు వాడబడుతుంది.

    • skb_copy_from_linear_data_offset() ఇప్పుడు వాడబడుతుంది.

    • spin_lock_irqsave() ఇప్పుడు భద్రమైన నిరోధ అసిద్ద లక్షణాన్ని అందిస్తోంది.

    • స్థంబన అప్పుడు సరళ తప్పు పరిశీలన జరుపబడుతున్నది.

    • మల్టికాస్టు కు చాలా సరికూర్పులు అమలవుతున్నాయి.

    • గ్రతంలో కంటే చిప్ రీసెట్ ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటోంది.

  • ifup/ifdown ఆదేశాలు పునరావృతంగా అమలవుతున్నప్పుడు కెర్నల్ ఇబ్బందికి కారణమవుతున్న లోపం సరిచేయుటకు Marvell sky2 డ్రైవర్: విడుదల 1.14కి నవీకరించబడింది.

  • forcedeth-0.60 డ్రైవర్: ఈ విడుదలలో చేర్చబడింది. NVIDIA's MCP55 మదర్ బోర్డు మరియు సంభదిత ఆన్ బోర్డు NIC వాడుతున్న వినియోగదారుల కొరకు చాలా లోపాల యొక్క క్లిష్ట సరికూర్పులను అమలుపరుస్తోంది.

  • ixgb డ్రైవర్: సరిక్రొత్త అప్ స్ట్రీమ్ విడుదల (1.0.126) కు నవీకరించబడింది.

  • NetXen 10GbE వలయ కార్డుల కొరకు మద్దతు సిద్దపరచుటకు netxen_nic డ్రైవర్: విడుదల 3.4.2-2 ను జతపరిచినది.

  • Chelsio 10G ఈదర్నెట్ వలయ నియంత్రిక ఇప్పుడు మద్దతునిస్తోంది.

  • PCI తప్పు సమీకరణకు s2io పరికరానికి మద్దతు జతకలుపబడింది.

  • nx6325 కార్డు కొరకు PCI ID కు బ్రాడ్కామ్ వైర్లెస్ ఈదర్నెట్ డ్రైవర మద్దతునిస్తోంది.

  • ifup.ద్వారా BCM4306ని ప్రారంభింప ప్రయత్నించునపుడు ASSERTION FAILED తప్పుకు కారణం అయ్యే లోపం సరిదిద్ద బడింది.

  • ixgbడ్రైవర్: Intel 10-gigabit కార్డుకు EEH PCI తప్పు సమీకరణ మద్దతు నిచ్చునట్లు నవీకరించబడింది. అదిక సమాచారం కొరకు /usr/share/doc/kernel-doc-<kernel version>/Documentation/pci-error-recovery.txt ను చూడండి.

  • qla3xxx డ్రైవర్: ను iSCSI ఉపయోగించ కుండా QLogic iSCSI ఎడాప్టర్సుకి నెట్వర్కింగ్ మద్దతునివ్వడానికి సిద్దపరచి మరియు విడుదల 2.03.00-k3 కి నవీకరించారు.

  • Intel PRO/Wireless 3945ABG వలయ డ్రైవర్: విడుదల 1.2.0 కి నవీకరించబడింది.కొన్ని ల్యాప్ టాప్ లలో ఆయా పరిస్తితులలో వచ్చు సాఫ్టులుకప్ లోపం,తో కలిపి ఈ నవీనీకరణ చాలా విషయాలను ముగింపచేసింది.

  • qla2xxx:డ్రైవర్ విడుదల 8.01.07-k6 కి నవీకరించబడింది.ఇది చాలా మార్పులను గమనించదగునట్లు అమలుపరిచింది.

    • iIDMA ఇప్పుడు మద్దతుఇవ్వబడుతోంది.

    • క్రింది ఫైబర్ ఛానల్ యాట్రిబ్యూట్సు కు మద్దతు నీయబడింది.

      • సింబాలిక్ ఉపయుక్త పేరు.

      • సిస్టమ్ అతిధేయి పేరు.

      • ఫాబ్రిక్ పేరు.

      • అతిధేయి పోర్టు స్థితి.

    • గుర్తింపు-నియంత్రి async కార్యాలు లాగ్ చేయబడవు.

    • రీసెట్ హ్యాడ్లింగ్ తార్కిక సరిదిద్ద బడింది.

    • MSI-X మద్దతివ్వబడుతోంది.

    • సిస్టమ్ కి IRQ-0 కూర్పులు హ్యాండిల్ చేయబడుతున్నవి.

    • NVRAM నవీకరణలు అప్పటికప్పుడే అమలు కాబడుతున్నవి.

IPMI

ఈ విడుదల IPMI డ్రైవర్ సెట్ ను విడుదల 2.6.21.3 యొక్క అప్ స్ట్రీమ్ మార్పులు,2.6.22-rc-4 ప్యాచెస్ తో కలిపి ఉండునట్లు నవీకరించబడింది.ఈ నవీకరణ క్రింది మార్పులను(వాటితో కలిపి) ఇస్తోంది.

  • ipmi_si_intf లోని విలువఇవ్వని డాటా లోపాన్ని సరిదిద్దింది.

  • వేరే డ్రైవర్ మద్దతు బంధకం అవుతున్నప్పుడు kipmid ప్రారంభంకాలేదు.

  • force_kipmid ద్వారా కెర్నల్ డెమాన్ enable ను ఓవర్ రైడ్ చేయుటకు ఇప్పుడు వినియోగదారులు అనుమతింపబడ్డారు.

  • పర్-చానల్ ఆదేశం నమోదు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • MAX_IPMI_INTERFACES ఉపయోగంలో లేదు.

  • హాట్ సిస్టమ్ అంతర్ముఖి తోలగింపు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • ఫర్ము వేర్ నవీనీకరణ మద్దతుకు నిర్వహణా రీతి కలుపబడింది.

  • pigeonpoint IPMC మద్దతుకుpoweroff కలుపబడింది.

  • BT ఉపడ్రైవర్ ఇప్పుడు దీర్ఘ కాలవినిమయాన్ని కాపాడగలదు.

  • హాట్ తొలగింపులో సరైన శుబ్రతకు pci_remove కలుపబడింది.

క్రొత్త గుణక పారామితుల సమాచారం కొరకు /usr/share/doc/kernel-doc-<kernel version>/Documentation/IPMI.txt చూడండి.

SCSI
  • Red Hat Enterprise Linux 4 నుండి SCSI బ్లాక్ లిస్టు ఈ విడుదలకి పోర్టు చేయబడింది.

  • added PCI IDs for aic79xx driver.

  • PRIMERGY RX800S2 మరియు RX800S3 కు మద్దతు ఇవ్వటానికి aacraid డ్రైవర్: విడుదల 1.1.5-2437 కు నవీకరించబడింది.

  • megaraid_sas డ్రైవర్: విడుదల 3.10 కి నవీకరించబడింది.ఈ నవీకరణ IOCTL మెమొరీ పూల్ కలుపుటకు,bios_paramకొరకు ప్రారంభ సూచిని నిర్దారించుటకు మరియు చిన్నలోపాలను సరిదిద్దుటకు ఉంది.

  • Emulex lpfc డ్రైవర్:విడుదల 8.1.10.9 కు నవీకరించబడింది. ఈవిడుదల చాలా మార్పులను గమనించు విధంగా నవీకరించబడింది.

    • host_lock నిర్వహణioctl మార్గంలో సరిదిద్దబడింది.

    • AMD చిప్సెట్ ఇప్పుడు స్వయంచాలకంగా గుర్తింపబడుతుంది,మరియు DMA పొడవును 1024 bytes కి తగ్గించింది.

    • dev_loss_tmo డిస్కవరి చేతనంగా ఉన్నప్పుడు ఉపయుక్తలు తొలగింపబడవు.

    • 8GB లింక్ వేగాలు ఇప్పుడు సిద్దపరచబడినవి.

  • qla4xxx డ్రైవర్ క్రింది మార్పులు అమలు పరచటానికి నవీకరించబడింది:

    • IPV6, QLE406x మరియుioctl గుణకానికి మద్దతివ్వబడినది.

    • లుకప్ కి కారణమయ్యే mutex_lock లోపం సరిచేయబడింది.

    • ఏ అంతర్ముఖి ఎగుమతి/దిగుమతి కైనా ప్రయత్నిస్తున్నప్పుడు qla4xxx మరియు qla3xxx యొక్క లుకప్ విషయాలు పరిష్కరించబడ్డాయి.

  • mpt fusion డ్రైవర్సు:విడుదల 3.04.04 కి నవీకరించబడింది.ఈ నవీకరణ చాలా మార్పులను గమనించు విదంగా అమలుపరిచింది.

    • చాలా ఎర్రర్ హ్యాడ్లింగ్ లోపాలు సరైనవి.

    • mptsas ఇప్పుడు టార్గెట్ రీసెట్లను క్రమబద్దీకరించింది.

    • mptsas మరియు mptfc ఇప్పుడు LUNs మరియు టార్గెట్లను 255 కి పైగా మద్దతిస్తున్నాయి.

    • బహిర్గతంగా నిదానమైన DVD పనితనానికి కారణమో LSI mptspi డ్రైవర్ రిగ్రెషన్ సరిచేయబడింది.

    • LSI SCSI పరికరము BUSY స్థితిని ఇచ్చినప్పుడు,చాలప్రయత్నాలు జరిగిన తరువాత ఇక I/O ప్రయత్నం విఫలమవ్వదు.

    • స్వయంచాలక-పునర్నిర్మాణం తరువాత RAID ఎరేస్ ఇక ఎక్కువ సేపు అసిద్దంగా ఉండవు.

  • Areca RAID నియంత్రణలకు మద్దతివ్వడానికి arcmsr డ్రైవర్:చేర్చబడినది.

  • 3w-9xxx గుణకం: సరిగ్గా 3ware 9650SE కి మద్దతివ్వుటకు నవీకరించబడినది.

కెర్నల్ నోట్సు

  • CIFS కక్షిదారు విడుదల 1.48aRH కి నవీకరించబడింది.1.48a ప్యాచస్ తోకూడిన విడుదల పై ఇది ఆదారపడివుంది,క్రింది మార్పులను అమలు పరుస్తుంది:

    • మౌంట్ ఐచ్చికం sec=none ఏకగ్రీవ మౌంట్ గా వస్తుంది.

    • POSIX ఎక్సటెన్ష్సు సిద్దంగా ఉన్నప్పుడు umask ను CIFS ఒప్పుకుంటుంది.

    • ప్యాకె ట్ ప్రవేశాన్ని అర్దించే sec= మౌంట్ ఐచ్చికం సరిచేయబడింది.

    EMC Celerra ఉత్పత్తి (NAS Code 5.5.26.x and below) వినియోగదారులు,EMC NAS లోని షేర్సును ఉపయోగిస్తున్నప్పుడు CIFS కక్షిదారు స్థంబిస్థుందని గమనించాలి.ఈ క్రింది కెర్నల్ సందేశాల ద్వారా ఈ విషయం వ్యక్తీకరించబడుతుంది.

    kernel:  CIFS VFS: server not responding
    kernel:  CIFS VFS: No response for cmd 162 mid 380
    kernel:  CIFS VFS: RFC1001 size 135 bigger than SMB for Mid=384
    

    CIFS మౌంట్ తర్వాత, ఏ ఫైలునైనా దానిలో చదువుటకు/వ్రాయుటకు మరియు I/O మౌంట్ సూచీ వద్దఅనువర్తనంతో ప్రయత్నించిన అసాధ్యంగా పరిగమించి స్థంబించును.దీనిని సరిదిద్దుటకు NAS కోడ్ 5.5.27.5 లేదా తరువాతి(use EMC Primus case number emc165978) కి నవీకరించు.

  • MODULE_FIRMWARE టాగ్సు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • ICH9 నియంత్రణలు ఇప్పుడు మద్దతిస్తోంది.

  • CPUID లో Greyhound ప్రోసెసర్సు మద్దతిస్తున్నవి.

  • Oprofile ఇప్పుడు క్రొత్త Greyhound పనితనపు కౌంటర్ కార్యాలకు మద్దతునిస్తోంది.

  • Directed DIAG ఇప్పుడు z/VM ఉపయోగాన్ని పెంపౌందించటానికి మద్దతిస్తోంది.

  • Intelగ్రాఫిక్సు చిప్సెట్ DRM కెర్నల్ గుణకం ద్వారా ఇప్పుడు పూర్తి మద్దతిస్తోంది.ఇంకా, DRM API సూటిరెండరింగు కు మద్దతివ్వటానికి విడుదల 1.3 కు నవీకరించబడింది.

  • ACPI కరెంటు నిర్వహణ నవీనీకరణ S3 suspend-to-RAM మరియు S4 హైబర్నేట్ ను అభివృద్దిచేసింది.

ఇత్రత్రా నోట్సు

  • gaim is now called pidgin.

  • Intel microcode ఇప్పుడు విడుదల 1.17 కి నవీకరించబడ్డాయి. ఇది క్రొత్త Intel ప్రోసెసర్సు కు మద్దతిస్తోంది.

  • ఇప్లిసిట్ చేతనా-చేతన ఫెయిల్ఓవర్ dm-multipathను EMC Clariion నిల్వలో ఉపయోగించుట మద్దతిస్తోంది.

  • చెనీస్ ఫాంట్ Zysong fonts-chinese ప్యాకేజ్ లో బాగంగా సంస్థాపించబడదు.Zysongఇప్పుడుfonts-chinese-zysong గా ప్యాకేజ్ చేయబడుతుంది.fonts-chinese-zysong ప్యాకేజ్ Supplementary CD లో ఉంచబడుతుంది.

    fonts-chinese-zysong ప్యాకేజ్ చెనీస్ జాతీయ ప్రమాణం GB18030 కు మద్దతివ్వవలిసి ఉంటుంది..

  • Challenge Handshake Authentication Protocol (CHAP) వినియోగదారునిపేరు మరియు పాస్ వార్డు ప్రతిఒక్క దానికి 256 అక్షర పరిమితిని కలిగిఉంది.

  • pump ఈ నవీనీకరణ లో డిప్రికేట్ చేయబడింది.అందుకని మీ వలయ అంతర్ముఖిని netconfig ద్వారా ఆకృతీకరించుట ifcfg కృతి విభజనకు కారణంకానచ్చు.

    మీ వలయ అంతర్ముఖిని సరిగా ఆకృతీకరించుటకు system-config-network ను వాడండి. నవీకరించిన system-config-network ప్యాకేజ్ సంస్థాపించిన netconfig ను తొలగించును.

  • rpm --aid మద్దతు నీయదు.మీరు ప్యాకేజ్ నవీకరించునపుడు మరియు సంస్థాపించునపుడు yum ను వాడుట మంచిది

సాంకేతిక పరిదృశ్యం

సాంకేతిక పరిదృశ్యం లక్షణాలు ప్రస్తుతం Red Hat Enterprise Linux 5.1 సబ్ స్క్రిప్షన్ సేవలకింద మద్దతివ్వటం లేదు, క్రియాశీలంగా పూర్తికాకపోవచ్చు, మరియూ సాధారణంగా ఉత్పత్తి వినియోగానికి ఉపయోగపడవు. ఏమైనప్పటికీ, ఈ లక్షణాలు వినియోగదారుని సౌలభ్యం కోసం చేర్చబడ్డాయి.

వినియోగదారుడు ఈ లక్షణాలను ఉత్పత్తి-రహిత వాతావరణానికి ఉపయోగించటానికి వాడవచ్చు. వినియోగదారుడు ఇది పూర్తిగా మద్దతివ్వటానికి ముందు ఫీడ్ బాక్ మరియూ సాంకేతిక పరిదృశ్యాల కోసం సూచనలను ఇవ్వవచ్చు.అధిక-సెవిరిటీ రక్షణ విషయాలకోసం Erratas సమకూర్చబడింది.

సాంకేతిక పరిదృశ్యాల అభివృద్ధిలో, అదనపు ఐచ్ఛికాలు ప్రజలకు పరిక్ష కోసం అందుబాటులో ఉంటాయి. ముందు వచ్చే చిన్న విడుదలలో సాంకేతిక పరిదృశ్యానికి పూర్తి మద్దతివ్వటం Red Hat యొక్క ఉద్దేశం.

స్థితిలేని Linux

ఈ విడుదలతో సహా ఇవి నిర్మణాత్మక ఉపకరణలు. స్థితిలేని లైనక్సు కంప్యూటరు ఎలా పనిచేస్తోంది మరియూ ఎలా నిర్వహించబడుతోందో తెలుసుకోవడానికి దీనిని ఆపరేటింగ్ సిస్టమ్ రీడ్-ఓన్లీ పద్దతి లో ఉపయోగించటం ద్వారా(నవీకరణ విషయాలకు /etc/sysconfig/readonly-root నుచూడండి) పూర్తి చేయవచ్చు.

దాని ప్రస్తుత అభివృద్ధి స్థితిలో, స్థితిలేని లక్షణాలు ఉద్దేశ్య లక్ష్యాలలో ఉపభాగాలుగా ఉంటాయి. సామర్ధ్యం సాంకేతక పరిదృశ్యంగా గుర్తించబడుతుంది.

ఈ కిందివి Red Hat Enterprise Linux 5లో ఉండే ప్రాధమిక సామర్ధ్యాల జాబితా:

  • NFSలో స్థితిలేని చిత్రం నడుస్తోంది

  • లూప్ బాక్ ద్వారా NFSలో స్థితిలేని చిత్రం నడుస్తోంది

  • iSCSIలో నడుస్తోంది

కింది దాంట్లోఉన్న స్థితిలేని కోడ్ చదవటానికి అధికంగా మద్దతివ్వబడుతుంది. http://fedoraproject.org/wiki/StatelessLinuxHOWTO మరియూ [email protected]లో చేరండి.

Stateless Linux కు నిర్మాణాత్మక భాగాలను సిద్దపరుచుట స్వచ్చంగా Red Hat Enterprise Linux 5 నందు పరిచయంచేయబడింది.

AIGLX

AIGLX పూర్తిగా మద్దతిస్తున్న X సర్వరు కంటే సాంకేతికంగా పూర్తి పరిదృశ్యం కలది. దీని లక్ష్యం GL-ప్రభావాలను ప్రామాణిక డెస్క్‍టాప్ మీద సాధ్యం చేయటం. ఈ ప్రాజెక్టు ఈ కింది వాటిని కలిగి ఉంది.

  • తక్కువగా మార్చబడ్డ X సర్వరు

  • కొత్త సమాచారం ప్యాకేజీ కొత్త చట్టం సమాచారాన్ని కలుపుతుంది

ఈ మూలకాలను సంస్థాపించటం ద్వారా, మీరు GL-ప్రభావాలను మీడెస్క్‍టాప్ యందు కొద్దిమార్పులతో కలిగి ఉంటారు, మీరు దాన్ని సాధ్యం చేయటమన్నది X సర్వరును సాధ్యంచేయటం లేదా చేయకపోవటం మీద ఉంటుంది. AIGLX కూడా దూరస్థ GLX అనువర్తనాలను GLX హార్డువేరు త్వరితత్వానికి సహకరిస్తాయి.

devicescape (d80211)

devicescape స్టాకు iwlwifi 4965GN వైర్లెస్ డ్రైవర్ ను సిద్దపరుస్తుంది.స్టాకు ఆయా వైర్లెస్ పరికరాలను ఏ Wi-Fi network కు అనుసంధానించుటకైనా అనుమతినిస్తుంది.

ఈ స్టాకు కోడ్ ఆధారితమైంది అది అప్ స్ట్రీమ్ చేత ఆమోదింపబడాలి.అదనంగా స్టాకు యొక్క స్థిరత్వం టెస్టింగ్ ద్వారా పరిశీలింపబడుతుంది. స్టాకు ఈ విడుదలలో సాంకేతిక పరిదృశ్యంగా కలుపబడింది.

FS-Cache

FS-Cache రిమోట్ ఫైల్ విధానం కోసం స్థానిక చేజింగ్ సౌకర్యం; ఇది వినియోగదారుల్ని NFS సమాచారాన్ని స్థానికంగా మరల్చబడిన డిస్కులో చేజ్ చేయటానికి అనుమతిస్తుంది. FS-చేజ్ సౌకర్యాన్ని అమర్చటానికి, cachefilesd RPMను సంస్థాపించండి మరియూ /usr/share/doc/cachefilesd-<version>/READMEని చూడండి.

సరిపోయినcachefilesd ప్యాకేజ్ సంస్థాపక ప్రతితో.విడుదల <version>.

కంప్యూటరుటాప్

Systemtap ఉచిత సాఫ్టువేరు (GPL) నిర్మాణాన్ని నడుస్తున్న Linux కంప్యూటరు యొక్క సమాచారాన్ని తేలిక చేయటానికి ఉపయోగిస్తుంది. అది దాని నేపధ్యం మరియూ క్రియాశీలతలో వచ్చే సమస్యలను నివారించటానికి ఉపయోగిస్తుంది. systemtap సహాయంతో, డెవలప్పర్లు టీడియస్ మరియూ మోసకారి సాధనం ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు, తిరిగి కూర్చటం, సంస్థాపన, మరియూ పునఃప్రారంభం సమాచారమ్ పొందటానికి కావలసి రావచ్చు.

iSCSI Target

Linux target (tgt) ఫ్రేమ్ వర్కు SCSI ప్రారంబిక గల వేరే సిస్టమ్సు లో బ్లాక్-లెవల్ SCSI నిల్వ సేవకు అనుమతిస్తుంది. ఈ సామర్ధ్యం ప్రప్రధమంగా Linux iSCSI టార్గెట్ గా ఉంచబడుతుంది,ఏ ప్రారంభికకైనా వలయంలో నిల్వను అందిచుటకు.

iSCSI టార్గెట్,కొరకుscsi-target-utils RPM సంస్థాపించి మరియు సూచనలను చూడండి:

  • /usr/share/doc/scsi-target-utils-<version>/README

  • /usr/share/doc/scsi-target-utils-<version>/README.iscsi

<version>సరిపోయిన ప్యాకేజి విడుదల తో దీనిని పునస్థాపించండి.replaceable >.

అధిక సమాచారానికి,man tgtadm చూడండి.

FireWire

firewire-sbp2 గుణకం సాంకేతిక పరిదృశ్యంగా ఈ నవీకరణలో చేర్చబడింది. ఈ గుణకాలు ఫైర్ వైర్ నిల్వ పరికరాలు మరియు గ్రాహికల అనుసంధానంతో సిద్దపరచబడింది.

ప్రస్తుతం,ఫైర్ వైర్ క్రింది వాటికి మద్దతునీయదు:

  • IPv4

  • pcilynx అతిధేయి నియంత్రికలు

  • బహుళ-LUN నిల్వ పరికరాలు

  • నిల్వ పరికరాల పై నాన్-ఎక్సుక్లూజివ్ అనుమతి

అదనంగా,క్రింది విషయాలు ఈ ఫైర్ వైర్ విడుదలలో ఇంకా ఉన్నాయి.

  • SBP2 డ్రైవర్ లో మెమొరీ లీక్ యంత్ర ప్రతిష్టంబనకు కారణం అవుతుంది.

  • ఈ విడుదలలోని కోడ్ big-endian యంత్రాలలో సరిగా పనిచేయడంలేదు.ఇది పవర్PC లో ఊహించని పరిణామానికి దారి తీయవచ్చు.

పరిష్కరించిన విషయాలు

  • SATA-ఎక్విప్డు సిస్టమ్సు లోబూట్ ప్రోసెస్ జరుగునప్పుడు స్థంబనకు ముందు తప్పును చూపించే లోపం ఇప్పుడు సరిదిద్దబడింది.

  • బహుళ బూట్ సిస్టమ్సు లోWindows Vista™ సంస్థాపించబడిన ప్రధమ విభజన యొక్క ప్రారంభ సెక్టార్ ను parted ఉంచుతుంది.బహుళ-బూట్ సిస్టమ్సు ని Red Hat Enterprise Linux 5.1 మరియు Windows Vista™ తో ఉంచితే,తరువాతది అన్ బూటబుల్ గా ఉండదు.

  • rmmod xennet domU క్రాష్ కావటానికి కారణంకాదు

  • 4-socket AMD Sun Blade X8400 సర్వరు గుణకం కంప్యూటరు మెమోరీ ఆకృతీకరణను node 0లో కలిగిలేదు బూటింగులో పానిక్ చేయబడుతుంది. కంప్యూటరు మెమోరీతో node 0లో కెర్నల్ పానిక్కుని నిరోధించటానికి ఆకృతీకరించబడవలసి ఉంటుంది.

  • conga మరియు luci ఇప్పుడు ఫెయిల్ ఓవర్ డొమైన్సు సృష్టించుటకు మరియు ఆకృతీకరించుటకు ఉపయోగపడుతుంది.

  • Cluster Storage సమూహాన్ని yum ద్వారా సంస్థాపించునపుడు,బదలీకరణ విఫలమవ్వదు.

  • సంస్థాపనయందు,సరికాని SELinux కాంటెస్ట్సు /var/log/faillog మరియు /var/log/tallylog కు జతపరచబడవు.

  • డ్యూయల్-కోర్ AMD ఫ్లాట్ఫాం లో ఒక CPU పై సిపియు-ఇన్టెన్సివ్ ప్రభావం CPU కోర్సు ప్రకంపనలు మార్చటానికి కారణం కాదు.,

  • సంస్థాపన Red Hat Enterprise Linux 5.1 స్ప్లిట్ సంస్థాపన మాధ్యమాన్ని ఉపయోగించుతోంది (ఉదాహరణకు, CD లేదా NFచేస్తుంటేISO), amanda-సర్వరు సంస్థాపనలో ఒక దోషం సంభవించింది.

  • సంస్థాపన జరుగునప్పుడు, Anaconda 4GB RAM ను గుర్తించగలదు. ఇది Anaconda ను కెర్నల్-PAE భేదకంను సంస్థాపించాలో లేదో స్వయంచాలకంగా నిర్ధారించుకొనునట్లు చేస్తుంది.

  • EDAC ఇప్పుడు క్రొత్త k8 ప్రోసెసర్సు లో సరైన మెమొరి మొత్తాన్ని ఇస్తోంది.

  • Gnome డెస్క్‍టాప్ లోకి దూరస్థ విధానంలో gdm ద్వరా ప్రవేశిస్తే ప్రవేశతెర స్థంభనకు కారణం కాదు.

  • బహుళ మరల్పులను అడ్డుకునే బగ్ autofs లో సరిచేయబడినది.

  • utrace కు క్రింది సరికూర్పులు చాలా ప్యాచేస్ వలన కలుగుతున్నవి:

    • ptrace ఉపయోగించునపుడు రేస్ కండీషన్ క్రాష్ కు కారణం అయ్యే లోపం సరిదిద్దబడింది.

    • PTRACE_PEEKUSR కాల్సు నుండి వచ్చే రిగ్రషన్ అది ఎర్రొనియస్ EIO కి కారణమగు దానిని సరిచేయబడింది

    • కొన్ని సందర్బాలలో చైల్డు ప్రభావితం కాబడడంవల్ల వచ్చు wait4 కాల్సు ఆపే రిగ్రెషన్ సరిదిద్దబడింది

    • SIGKILL ను ప్రోసెస్ ముగింపు నుండి ఆపే రిగ్రెషన్ సరిచేయబడింది. ptrace కొన్ని సందర్బాలలో ప్రోసెస్ పైన అమలైనప్పుడు ఇది అవసరమౌతుంది.

  • RealTime Clock (RTC) లోపం ఏదైతే గడియారాన్ని మరియు RTC నిరోధాలను సరిగా పనిచేయనీయదో అది సరిదిద్దబడింది.

తెలిసిన విషయాలు

  • మొదటి సారి Release Notes ను నొక్కినప్పుడు Anaconda లో విండో విడుదల నోడ్సు ఇవ్వటానికి ఆలస్యమవుతుంది.ఈ ఆలస్యం ఖాళీ జాబితా కనబడుటకి కారణం.ఇది సాదారణంగా త్వరగా జరుగుతుంది, కనుక వినియోగదారులు దీన్ని గుర్తించరు.

    ప్యాకేజీ సంస్థాపనా తరుణం సంస్థాపన యొక్క CPU-ఇంటెన్సివ్ తరుణం అదే ఈ ఆలస్యమునకు కారణం.

  • ఆతిధేయ bus ఎడాప్టర్లు MegaRAID డ్రైవుకి ఉపయోగించేవి "Mass Storage" emulation రీతిలో ఉపయోగించటానికి తప్పక అమర్చాలి, "I2O" emulation రీతిలో కాదు. ఇది చేయటానికి, ఈ కింది విధానాన్ని చేయండి:

    1. MegaRAID BIOS అమర్పు వినియోగాన్నిఇవ్వండి.

    2. ఎడాప్టరు అమర్పు జాబితానిఇవ్వండి.

    3. ఇతర ఎడాప్టర్ ఐచ్ఛికాల కింద, ఎమ్యులేషన్ను ఎన్నుకోండి మరియూ మాస్ నిల్వలో ఉంచండి.

    ఒకవేళ ఎడాప్టరు "I2O" ఎమ్యులేషన్ క సరిగా అమర్చబడక పోతే, కంప్యూటరు i2o డ్రైవరును లోడుచేయటానికి ప్రయత్నిస్తుంది. ఇది విఫలమౌతుంది, లోడయ్యే డ్రైవర్లనుండీ నిరోధిస్తుంది.

    Red Hat Enterprise Linux ముందలి విడుదలలు సాధాణంగా I2O డ్రైవరును మెగాRAID డ్రైవరుకంటే ముందు లోడు చేయటానికి ప్రయత్నించవు. దీనికి సంబంధించి, లైనక్సును ఉపయోగించటానికి ముందు హార్డువేరు "Mass Storage" ఎమ్యులేషన్ రీతిలో అమర్చబడాలి.

  • Cisco Aironet MPI-350 వైర్లెస్ కార్డులున్న లాప్టాప్లు DHCP చిరునామాలను వైర్డు ఈధర్ నెట్ పోర్టు ఉపయోగించి చేసే నెట్వర్కు ఆధారిత సంస్థాపనలో హాంగవ్వొచ్చు.

    దీనితో పనిచేసేటప్పుడు, మీ సంస్థాపనకు స్థానిక మాధ్యమాన్ని ఉపయోగించండి. ప్రత్యామ్నాయంగా, మీరు లాప్ టాప్ BIOS priorలో సంస్థాపనకు వైర్లెస్ కార్డును సాధ్యం చేయవచ్చు (సంస్థాపన పూర్తయ్యినతరువాత మీరు తిరిగి కార్డును సాధ్యం చేయగలుగుతారు).

  • ప్రస్తుతం, system-config-kickstart ప్యాకేజీలను ఎన్నికచేయటం మరియూ చేయకపోవటానికి మద్దతివ్వదు. system-config-kickstartను ఉపయోగించేటప్పుడు, ఈ ప్యాకేజీ ఎన్నిక ఐచ్ఛికం అది అసాధ్యమని సూచిస్తుంది. ఇది system-config-kickstart yumను సమూహ సమాచారాన్ని కూర్చటానికి ఉపయోగించటంవల్ల, కానీ yum Red Hat Networkకి అనుసంధించటానికి ఆకృతీకరించటానికి కుదరదు.

    మీమీ కిక్ స్ట్రార్టు ఫైలులో మానవీయంగా ప్యాకేజీ ఫైళ్లను నవీకరించవలసి ఉంది. system-config-kickstartను కిక్ స్టార్టు ఫైలును తెరవటానికి ఉపయోగిస్తున్నప్పుడు, మీరు అన్ని ప్యాకేజీల సమాచారాన్నీ తీసుకోవలసి ఉంటుంది వాటిని భద్రపరిచేటప్పుడు వెనక్కి ఇవ్వవలసి ఉంటుంది.

  • /var/log/boot.logకి Boot-time ప్రవేశం ఈ Red Hat Enterprise Linux 5 విడుదలలో అందుబాటులో లేదు. ముందలి నవీకరణలలో సమానమైన క్రియాశీలత సమకూర్చబడుతుంది.

  • Red Hat Enterprise Linux 4 to Red Hat Enterprise Linux 5 నుండీ నవీకరిస్తున్నప్పుడు, డిప్లోయ్ మెంట్ నివేదిక మానవీయంగా సంస్థాపించబడదు. మీరు pirutను నవీకరణ పూర్తయ్యినతరువాత దాన్ని మానవీయంగా సంస్థాపించవలసి ఉంటుంది.

  • ఈ కంప్యూటరు kexec/kdump కెర్నలులోకి విజయవంతంగా పునఃప్రారంభించబడదు X కనుక వేసా కంటే వేరైనదాన్ని ఉపయోగిస్తున్నా లేదా నడుస్తున్నా. ఈ సమస్య ATI Rage XL గ్రాఫికల్ చిప్ సెట్టుతో కూడిఉంది.

    X ATI Rage XLతో కంప్యూటరు ఎక్యూప్డుతో నడుస్తుంటే, అది వేసా డ్రైవరును kexec/kdump కెర్నలులోకి విజయవంతంగా రీబూటు చేయటానికి ఉపయోగిస్తుంది.

  • మీ కంప్యూటర్లలో Red Hat Enterprise Linux 5ను nVidia CK804 చిప్ సెట్టుసంస్థాపనతో వినియోగిస్తున్నప్పుడు, కింది దానితో సమానమైన కెర్నల్ సమాచారాన్ని పొందవచ్చు.

    kernel: assign_interrupt_mode Found MSI capability
    kernel: pcie_portdrv_probe->Dev[005d:10de] has invalid IRQ. Check vendor BIOS
    

    ఈ సమాచారాలు PCI-E పోర్ట్సు IRQలను అడగవు. ఇతరత్రా, ఈ సమాచారాలు, ఏమైనప్పటికీ, కంప్యూటరు క్రియాశీలతను దెబ్బతీయవు.

  • మూలంగా ప్రవేశించినప్పుడు తీసివేయు నిల్వ పరికరాలు(CDs మరియుDVDs) స్వయంచాలకంగా మౌంట్ అవ్వవు.అప్పుడు గ్రాఫికల్ ఫైల్ మేనేజర్ ద్వారా మానవీయంగా పరికరాన్ని మౌంట్ చేయవలె.

    ప్రత్యామ్నయంగా మీరు ఈ క్రింది ఆదేశాన్ని పరికరం మౌంట్ అవ్వటానికి వాడవచ్చు /media:

    mount /dev/<device name> /media
    
  • IBM System z సాంప్రదాయక Unix-శైలి యొక్క భౌతిక కన్సోలుని సమకూర్చలేదు. అలాగే, Red Hat Enterprise Linux 5 IBM System z కోసంసంస్థాపన పరిక్రమం లోడయ్యేటప్పుడు firstboot క్రియాశీలతకు మద్దతివ్వలేదు.

    IBM System zలో సరైన Red Hat Enterprise Linux 5 సంస్థాపక అమర్పుకు, ఈ కింది ఆదేశాలను సంస్థాపన తరువాత ఉపయోగించండి:

    • /usr/bin/setup — provided by the setuptool package.

    • /usr/bin/rhn_registerrhn-setupప్యాకేజీతో సమకూర్చబడింది

  • Red Hat Enterprise Linux 5 to Red Hat Enterprise Linux 5.1 ను Red Hat Network ద్వారా నవీకరిస్తున్నప్పుడు,yum మిమ్ముల్ని redhat-beta key దిగుమతి చేయమని అడగదు.నవీకరణకు ముందే మీరు మానవీయంగా redhat-beta key దిగుమతిచేయుట మంచిది. ఇది చేయుటకు క్రింది ఆదేశాన్ని నడపండి.గదు.

    rpm --import /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-beta

  • LUN ఆకృతీకరించబడిన దస్త్రం లో గుర్తించబడినప్పుడు అతిధేయి లో మార్పు ప్రతిబింబిచదు.అటువంటప్పుడు lvm ఆదేశాలు dm-multipath వినియోగంలో ఉన్నప్పుడు స్థంబించబడతాయి,LUN ఇప్పుడు stale అవుతుంది.

    దీనికోసం,అన్ని పరికరాల మరియు mpath లింకు ప్రవేశాలు/etc/lvm/.cache లో ప్రత్యేకంగా స్టేట్ LUN తోలగించాలి.

    ఈ ప్రవేశాలు ఏమిటో కనిపెట్టటానికి క్రింది ఆదేశాన్ని ఉపయోగించు:

    ls -l /dev/mpath | grep <stale LUN>

    ఉదాహరణకు <stale LUN> is 3600d0230003414f30000203a7bc41a00,అయితే క్రింది ఫలితాలు రావచ్చు:

    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00 -> ../dm-4
    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00p1 -> ../dm-5
    

    దీని అర్ధం 3600d0230003414f30000203a7bc41a00 ఇప్పుడు mpath links: dm-4 మరియు dm-5 రెంటికి మేప్ చేయబడుతుంది.

    ఈ క్రింది పంక్తులు /etc/lvm/.cache: నుండి తొలగించాలి:

    /dev/dm-4 
    /dev/dm-5 
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00p1
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00p1
    
  • పూర్తిగా సృజనీయీకరించబడ్డ విండోస్™ను CD / DVD నుండీ ,సృష్టించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆతిధేయ సంస్థాపన యొక్క రెండోదశ పునఃప్రారంభంలో కొనసాగించలేదు.

    దీనితో పనిచేయటానికి, /etc/xen/<name of guest machine> CD / DVD సాధనానికి సరైన ప్రవేశంగా కూర్చటం ద్వారా ఏర్పరచండి.

    సాధారణ ఫైలుకి సంస్థాపన సృజనీయిక సాధనాన్ని ఉపయోగిస్తుంటే, ఈ డిస్కు పంక్తి యొక్క /etc/xen/<name of guest machine> కింది విధంగా చదువుతుంది:

    disk = [ 'file:/PATH-OF-SIMPLE-FILE,hda,w']
    

    ఆతిధేయిలో /dev/dvdగా ఉంచబడ్డ DVD-ROM సాధనం 2 దశ సంస్థాపనలో అందుబాటులో ఉండవచ్చు hdcలో 'phy:/dev/dvd,hdc:cdrom,r'గా ఉండవచ్చు. అలాంటప్పుడు, డిస్కు ఈ కింది విధంగా చదవబడుతుంది:

    disk = [ 'file:/opt/win2003-sp1-20061107,hda,w', 'phy:/dev/dvd,hdc:cdrom,r']
    

    సాధనం యొక్క మార్గం మీ హార్డువేరు మీద ఆధారపడి ఉంటుంది.

  • sctp గుణకాన్ని కెర్నల్ కు కలుపక పోతే,netstat ను-A inet లేద -A inet6తో నడుపుట అసాధారణ ముగింపు క్రింది సందేశం తో సంభవిస్తుంది

    netstat: no support for `AF INET (sctp)' on this system.        
    

    దీనిని తొలగించుటకుsctp కెర్నల్ మాడ్యూల్ ను సంస్థాపించు:

  • బూట్ సమయమందు ప్రస్తుత కెర్నల్ Data Terminal Ready(DTR) సూచనలను ముద్రణకు ముందల సీరియల్ పోర్టులకు ఇవ్వడంలేదు.DTR ఎస్సర్షన్సు కోన్ని పరికరాలకు అవసరం,ఫలితంగా ఆ పరికరాలలో కెర్నల్ బూట్ సందేశాలు వరుస కన్సోల్సు పై ముద్రించబడవు.

  • AMD 8132 మరియు HP BroadCom HT100ను MMCONFIGసైకిల్సు ను మద్దతివ్వని ఫ్లాట్ఫాం(such as the HP dc7700) పై ఉపయోగిస్తారు.మీ సిస్టమ్ ఈ చిప్సెట్ ను వాడుతుంటే,మీ PCI ఆకృతీకరణ లెగసీPortIO CF8/CFC మిషన్సు ను వాడాలి.దీనిని ఆకృతీకరించుటకు సిస్టమ్ ను సంస్థాపనప్పుడు కెర్నల్ పారామతో బూట్ చేసి మరియు బూటింగ్ తరువాత pci=nommconfను GRUBకు కలుపు.

    ఇంకా AMD 8132 చిప్సెట్ Message Signaled Interrupts (MSI) కు మద్దతివ్వదు. మీ సిస్టమ్ ఈ చిప్సెట్ వాడుతుంటే మీరు MSI ని అచేతనం చేయాలి.ఇది చేయుటకు సంస్థాపనయందు కెర్నల్ పారామితిని -pci nomsiఉపయోగించి మరియు pci=nomsi ను బూట్ తర్వాత GRUB కి కలుపండి.

    మీ సిస్టమ్ ఇప్పటికే కెర్నల్ యొక్క బ్లాక్ లిస్టులో ఉంటే,మీ సిస్టమ్ కు ముందుగా చెప్పబడిన pci కెర్నల్ పారామితులు అవసరంలేదు.ఈ క్రింది HP ఫ్లాట్ఫాం లు కెర్నల్ చేత బ్లాక్ లిస్టు చేయబడినవి:

    • DL585g2

    • dc7500

    • xw9300

    • xw9400

  • బేర్-మెటల్ ను(non-Virtualized)కెర్నల్ నడుపుతున్నప్పుడు,X సర్వర్ EDID సమాచారాన్ని మానిటర్ నుండి తెచ్చుకోలేదు.ఇది జరిగినప్పుడు గ్రాఫిక్ డ్రైవర్ 800x600 కన్నా ఎక్కువ రెజొల్యూషన్ ప్రదర్శింపలేదు.

    దీని కోసం,/etc/X11/xorg.conf విభాగం యొక్క ServerLayout కు ఈ క్రింది పంక్తిని కలపండి.

    Option "Int10Backend" "x86emu"
    
  • ఈ విడుదల లోనిVirtual Machine Manager (virt-manager)వినియోగదారులను పారావర్చ్యులైజ్డు అతిధేయ సంస్థాపనకు అదనపు ఆర్గుమెంట్లను ఇవ్వనివ్వదు.ప్రత్యేకమైనన హార్డువేర్ లలో కోన్ని రకాల పారావర్చ్యులైజ్డు అతిధేయాల సంస్తాపనకు కూడ అటువంటి ఆర్గుమెంట్ లను ఇవ్వదు.

    ఆ విషయం virt-managerయొక్క భవిష్య విడుదలలో చెప్పబడుతుంది. ఆర్బిటరి కెర్నల్ ఆర్గుమెంట్లను కమాండ్ లైన్ ద్వారా పారావర్చ్యులైజ్డు అతిధేయ సంస్థాపనకు virt-install ద్వారా తెలుపవచ్చు.

  • dm-multipath ఆకృతీకరణలో Netapp పరికరాలు గతంలో విఫలమైన మార్గాన్ని రీస్టోర్ చేసిన తరువాత ఫెయిల్ బాక్ పూర్తిచేయుటకు చాలా నిమషాలు పట్టవచ్చు. దీనిని సరిదిద్దుటకుmultipath.conf విభాగంలోని పరికరాలుకు క్రింది Netapp పరికర ఆకృతిని కలపండి.

    devices {
            device {
                    vendor                  "NETAPP"
                    product                 "LUN"
                    getuid_callout          "/sbin/scsi_id -g -u -s /block/%n"
                    prio_callout            "/sbin/mpath_prio_netapp /dev/%n"
                    features                "1 queue_if_no_path"
                    hardware_handler        "0"
                    path_grouping_policy    group_by_prio
                    failback                immediate
                    rr_weight               uniform
                    rr_min_io               128
                    path_checker            directio
            }
    

( x86 )



[1] ఈ సామగ్రి http://www.opencontent.org/openpub/లో అందుబాటులో ఉన్న ఓపెన్ పబ్లికేషన్స్‍‌లైసెన్సు, v1.0, లోని విషయప్రధాన నిబంధనలను పంపిణీ చేయవచ్చు.